శ్రీవారి అన్నదానం ట్రస్టుకు రూ. కోటి విరాళం
రూ. కోటి విరాళంగా ఇచ్చిన సుమధుర గ్రూప్
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో లక్షలాది మంది భక్తులకు నిత్యం శ్రీ వెంగమాంబ కాంప్లెక్స్ లో అన్నదానం కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి రోజూ 80 వేల నుంచి లక్ష మంది దాకా తిరుమల కొండపై కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకుంటున్నారు.
ఇందులో భాగంగా టీటీడీ అన్నదానం ట్రస్టును ఏర్పాటు చేసింది. భక్తులు తమ వంతుగా విరాళాలు అన్నదానం కోసం సాయం చేస్తున్నారు. విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా బెంగళూరు, హైదరాబాద్ కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు కార్య నిర్వహణ అధఙకారి సీ హెచ్ వెంకయ్య చౌదరికి విరాళంగా రూ. ఒక కోటి రూపాయల చెక్కును అందజేశారు.
విరాళానికి సంబంధించిన డీడీని తిరుమల లోని గోకులం అతిథి భవనంలోని అదనపు ఈవో కార్యాలయంలో చౌదరికి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుమధుర గ్రూప్ సంస్థ డైరెక్టర్లు భరత్ కుమార్, నవీన్ కుమార్, శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.