ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) గురువారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల డిసెంబర్ నెలకు సంబంధించి విశేష పర్వ దినాలు వెల్లడించింది. భక్తులు ఆయా తేదీలలో స్వామి, అమ్మ వార్లను దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని కోరారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు.
ఇదిలా ఉండగా పర్వ దినాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 1వ తేదీన శ్రీవారి ఆలయంలో 4వ విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభం అవుతుంది.
11వ తేదీన సర్వ ఏకాదశి, 12న చక్రతీర్థ ముక్కోటి, 13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర, 14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం ఉంటుందని టీటీడీ వెల్లడించింది.
ఇక డిసెంబర్ 15న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం జరుగుతుంది. 16న ధనుర్మాసం ఆరంభం అవుతుంది. 26న సర్వ ఏకాదశి, 29న మాస శివరాత్రి, తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం ఉంటుందని టీటీడీ తెలిపింది. ఇక డిసెంబర్ 30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది.