ఆమోదించిన పాలక మండలి
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సంచలన నిర్ణయాలు తీసుకుంది. 2024-25 సంవత్సరానికి సంబంధించి టీటీడీ రూ. 5,141 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్ ను రూపొందించింది. దీనిపై సోమవారం టీటీడీ పాలక మండలి చర్చించింది. ఈ మేరకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డితో పాటు పాలక మండలి సభ్యులు హాజరయ్యారు ఈ కీలక సమావేశానికి. దేవాలయంలో రోజు రోజుకు పెరుగుతున్న భక్తులకు అదనపు సౌకర్యాలు సమకూర్చేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది.
పోటు విభాగంలో పని చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంచడం, శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది టీటీడీ పాలకమండలి. రూ. 30 కోట్లతో గోగర్భం, ఆకాశ గంగ వరకు నాలుగు వరుసల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. దీనికి కూడా ఆమోదం తెలిపింది పాలక మండలి.