DEVOTIONAL

తిరుమ‌ల తిరుప‌తి పాల‌క మండ‌లి ర‌ద్దు

Share it with your family & friends

తీర్మానాన్ని ఆమోదించిన ఏపీ ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి – ప్ర‌సిద్ది చెందిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) బోర్డు ర‌ద్ద‌యింది. మొత్తం గ‌త ప్ర‌భుత్వం 24 మంది స‌భ్యులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. వారు చేసిన రాజీనామాల‌ను ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది.

వీరు రాజీనామాలు చేయ‌డంతో టీటీడీ బోర్డు మొత్తం ఖాళీ అయ్యింది. దీంతో టీటీడీకి కొత్త చైర్మ‌న్ తో పాటు బోర్డు స‌భ్యుల‌ను నియ‌మించు కోవాల్సి ఉంటుంది. ఇందు కోసం ఏపీ స‌ర్కార్ ఫోక‌స్ పెట్ట‌నుంది. ఇప్ప‌టికే టీటీడీ చైర్మ‌న్ ఎంపిక విష‌యంలో ప‌లు పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

వీరిలో ఎక్కువ‌గా వినిపిస్తున్న‌ది తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు అశోక గ‌జ‌ప‌తి రాజు, మీడియా సంస్థ చైర్మ‌న్ నాయుడుతో పాటు ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు జ‌న‌సేన పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నాగ‌బాబు కొణిదల పేర్లు.

ఎవ‌రికి టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కుతుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ప్ర‌స్తుతం ఏపీ స‌ర్కార్ లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. అశోక్, నాయుడు, కొణిదెల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. వీరు కాకుండా మ‌ధ్యే మార్గంగా ఇంకొక‌రి పేరును తెర పైకి తీసుకు వ‌స్తారా అన్న‌ది తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం టీటీడీకి కొత్త‌గా ఈవోగా సీనియ‌ర్ అధికారి జె. శ్యామ‌ల రావును నియ‌మించింది.