దేశ వ్యాప్తంగా వీడియో వైరల్
తిరుమల – శ్రీవారి సన్నిధిలో టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ బూతు పురాణం కలకలం రేపింది. తిరుమలకు లక్షలాది మంది దర్శనం కోసం తరలి వస్తారు. ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన సభ్యుడు భక్తుల ముందే ఉద్యోగిపై చిందులు వేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు.
వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకునే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అంతే కాకుండా భక్తుల తల దించుకునేలా, వారి మనోబావాలు దెబ్బ తినేలా సిబ్బంది ఒకరిని థర్డ్ క్లాస్ నా కొడుకువి అంటూ తిట్టాడు. బూతులతో రెచ్చి పోవడమే కాకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ హుకూం జారీ చేశాడు. అందరూ చూస్తూ ఉండగానే ఇదంతా జరిగింది.
బ్రేక్ దర్శనం ద్వారా స్వామిని దర్శించుకున్నారు. అయితే టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ మహా ద్వారం గేటు ద్వారా వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఉద్యోగి బాలాజీ అభ్యంతరం తెలిపారు. ఇక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతి లేదని, ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. దీంతో రెచ్చి పోయాడు. తాను ఎవరినని అనుకుంటున్నావ్. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు అంటూ ఫైర్ అయ్యారు.