Sunday, April 20, 2025
HomeDEVOTIONALభ‌క్తురాలి కుటుంబానికి టీటీడీ ఆర్థిక సాయం

భ‌క్తురాలి కుటుంబానికి టీటీడీ ఆర్థిక సాయం

రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించిన బోర్డు స‌భ్యులు

త‌మిళ‌నాడు – తిరుప‌తిలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టోకెన్ల జారీ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న‌లో మృతి చెందిన త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన భ‌క్తురాలికి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి స‌భ్యులు రూ. 25 ల‌క్ష ప‌రిహారం అంద‌జేశారు. ఈ ఘ‌ట‌న జ‌న‌వ‌రి 8న చోటు చేసుకుంది. త‌మిళ‌నాడు రాష్ట్రం మెట్టు సేల‌కు చెందిన మ‌ల్లిక కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి చెక్కు అందించారు.

పరిహారం చెక్ ను మృతురాలు మల్లిక ఏకైక కుమారుడు రమేష్ కు టిటిడి బోర్డు సభ్యులు నరేష్ కుమార్, .రామ్మూర్తి, శాంతారాం, కృష్ణ మూర్తి అందజేశారు.

టిటిడి పాలక మండలి తీర్మానం ప్రకారం పరిహారం చెల్లించగా, బాధితుల కుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేందుకు వారి కుటుంబ సభ్యుల వివరాలను బోర్డు సభ్యుల బృందం తీసుకున్నారు.

బాధిత కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు టిటిడి బోర్డు సభ్యులతో మూడు బృందాలు ఏర్పాటు చేశారు, అందులో భాగంగా మృతురాలి కుటుంబ సభ్యులు ఉండే గ్రామానికి సదరు బోర్డు సభ్యులు వెళ్లి పరిహారం అందజేసి పరామర్శించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments