పీఠాధిపతుల సూచనలు ప్రశంసనీయం
టీటీడీ చైర్మన్ భూమన..ఈవో ధర్మా రెడ్డి
తిరుమల – తిరుమలలో గత మూడు రోజులుగా నిర్వహించిన ధార్మిక సదస్సు ముగిసింది. ఈ సందర్బంగా 60 మందికి పైగా దేశంలోని వివిధ మఠాలకు చెందిన మఠాధిపతులు, పీఠాధిపతులు పాల్గొన్నారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి,, ఈవో ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
ఈ సందర్బంగా కీలకమైన సూచనలు చేశారని, వారందరి అభిప్రాయలను పరిగణలోకి తీసుకుంటామని, వీటిని రికార్డు చేసి టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేస్తామని , వాటిని అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని భూమన, ధర్మా రెడ్డి తెలిపారు.
మూడు రోజుల పాటు వివిధ అంశాలు చర్చకు వచ్చాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. ఆ దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కృపతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి, ఏవీ ధర్మా రెడ్డి.
త్వరలోనే టీటీడీ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీఐపీ దర్శన్ టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.