Thursday, April 17, 2025
HomeDEVOTIONALఇతర మతస్తులకు స్వాగతం

ఇతర మతస్తులకు స్వాగతం

టీటీడీ చైర్మ‌న్ భూమన కరుణాకర రెడ్డి

తిరుమల – మాన‌వులంతా ధర్మ బద్ధంగా జీవించాలని తెలిపే హిందూ సనాతన ధర్మం ప్రపంచం లోనే అతి ప్రాచీనమైన మత విశ్వాసమని కొనియాడారు టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. ఈ ధర్మాన్ని ఆచరించేందుకు తమకు తాముగా, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఇతర మతాలకు చెందిన వారిని స్వాగతిస్తున్నామని అన్నారు.

తిరుమ‌ల‌లో టీటీడీ ఆధ్వ‌ర్యంలో మూడు రోజుల పాటు ధార్మిక స‌ద‌స్సును నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మానికి దేశంలో పేరు పొందిన మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తులు హాజ‌ర‌య్యారు. త‌మ విలువైన సూచ‌న‌లు, స‌ల‌హాలు అంద‌జేశారు.

ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ధార్మిక సదస్సులో ఛైర్మన్ మాట్లాడారు. సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా హిందూ ధర్మం పట్ల అపారమైన గౌరవం, విశ్వాసం గల ఇతర మతాల వారిని ఆహ్వానించేందుకు తిరుమలలో తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ యోచిస్తున్నట్లు చెప్పారు.

ఇతర మతాల భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే శ్రీ వేంకటేశ్వరస్వామివారి పాద కమలాల వద్ద హిందూ ఆచారాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ధార్మిక సదస్సులో పాల్గొన్న పీఠాధిపతులందరూ ఈ విషయాలను అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments