సామాన్య భక్తులకే ప్రయారిటీ
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి
తిరుమల – సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి. తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో ధార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా భూమన ప్రసంగించారు. తాను అభ్యుదయ రాజకీయాలు చేసినా భగవంతుడు, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించ లేదని స్పష్టం చేశారు.
తిరుమల ఆస్థాన మండపంలో రెండవ రోజు ఆదివారం ధార్మిక సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దయతోనే తాను రెండు సార్లు టీటీడీ ఛైర్మన్, మూడు సార్లు టీటీడీ బోర్డు సభ్యుడిని అయ్యాయని చెప్పారు. తన ద్వారా ఇలాంటి గొప్ప పనులు చేయించాలనే స్వామి వారు తనకు ఈ అదృష్టం ప్రసాదించారని స్పష్టం చేశారు.
స్వామి వారు తన ఆలయం నుండి గొప్ప సందేశం అందించాలనే దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులను ఇక్కడికి రప్పించారన్నారు. ధార్మిక సదస్సులో స్వామీజీలు అందించే సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని సనాతన హైంధవ ధర్మం పరిఢవిల్లేలా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు భూమన కరుణాకర్ రెడ్డి.