టీటీడీ మాజీ బోర్డు సభ్యులకు సూచన
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీటీడీ మాజీ బోర్డు సభ్యులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. గతంలో నిర్దేశించిన నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. టీటీడీ చైర్మన్ భూమన మీడియాతో మాట్లాడారు.
టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు మాత్రమే వారి కుటుంబ సభ్యులతో (భార్య, పిల్లలతో ) శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం బోర్డు కల్పించిందని చెప్పారు. అయితే కొందరు మాజీ బోర్డు సభ్యులు ఈ నిబంధనకు విరుద్ధంగా తమ కుటుంబ సభ్యులతో కాకుండా ఇతరులను వెంట బెట్టుకొని శ్రీవారి దర్శనం కొరకు పదే పదే రావడం మంచి పద్ధతి కాదని ఆయన ఆన్నారు.
మాజీ బోర్డు సభ్యులు ఆ హోదాలో కేవలం వారి కుటుంబ సభ్యులతో మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలే తప్ప, ఇతరులను వెంట బెట్టుకుని వస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదని హెచ్చరించారు భూమన కరుణాకర్ రెడ్డి.