DEVOTIONAL

ఘ‌నంగా తిరుప‌తి పుట్టిన రోజు వేడుక‌లు

Share it with your family & friends

టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

తిరుప‌తి – ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన న‌గ‌రం తిరుప‌తి. ఈ న‌గ‌రం పేరు ఎత్తితే చాలు తిరుమ‌ల గుర్తుకు వ‌స్తుంది. ఆ వెంట‌నే దేవ దేవుడు, క‌లియుగ వాసుడు , కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భాసిల్లే శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి గుర్తుకు వ‌స్తాడ‌ని పేర్కొన్నారు టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.

చిదంబ‌రం నుంచి గోవింద రాజ స్వామి ప్ర‌తిమ‌ను తీసుకు వ‌చ్చామ‌న్నారు. రామానుజాచార్యులు ప్రతిమను తీసుకొచ్చిన తరువాత తిరుపతికి గోవిందపురంగా నామకరణం చేశార‌ని టీటీడీ చైర్మ‌న్ చెప్పారు.

తిరుప‌తి ఆవిర్భావంపై ఇప్ప‌టికీ శాస‌నాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ న‌గ‌రం పుట్టినరోజు జరుపు కోవడం పూర్వజన్మ సుకృతంగా తాను భావిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు టీటీడీ చైర్మ‌న్. అందరూ భాగస్వామ్యులై పుట్టిన రోజు పండుగను చేస్తున్నామ‌ని అన్నారు. ప్రతియేటా ఈ పుట్టిన రోజు వేడుకలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా బ్రహ్మోత్సవాలతో సమానంగా తిరుపతి పుట్టిన రోజును జరుపుకుంటున్నామ‌ని అన్నారు టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి.