‍టీటీడీ చైర్మ‌న్ షాకింగ్ కామెంట్స్

Share it with your family & friends


ఆల‌యంలో హిందువుల‌కే ఛాన్స్

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నూత‌న చైర్మ‌న్ గా ఎంపికైన బీఆర్ నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందువుల‌కు మాత్ర‌మే టీటీడీలో చోటు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. తిరుమలలో హిందువులకు మాత్రమే సిబ్బంది విధానాన్ని ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

తిరుమల ఆలయంలో హిందువులకు మాత్రమే సిబ్బంది విధానాన్ని తీసుకు రావాలని పిలుపునిచ్చారు, పవిత్రతను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. హిందూయేతర ఉద్యోగులకు సాధ్యమయ్యే బదిలీలు లేదా పదవీ విరమణ చేసేలా ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుపుతామ‌ని వెల్ల‌డించారు.

ఆల‌య పవిత్రతను పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు టీటీడీ నూత‌న చైర్మ‌న్.
తిరుమల ఆలయంలో హిందువులకు మాత్రమే సిబ్బంది ఉండేలా , ప‌ని చేసేలా ఉండాల‌న్న‌ది త‌మ అభిమ‌త‌ని చెప్పారు బీఆర్ నాయుడు.

హిందూ విశ్వాసం, పవిత్రతకు ప్రతీకగా తిరుమల నిలిచి పోయేలా తన నిబద్ధతను నాయుడు నొక్కి చెప్పారు.

తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరూ హిందువులే ఉండాల‌న్నారు.. అదే నా మొదటి ప్రయత్నం. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయ‌ని తెలిపారు. టీటీడీకి చైర్మ‌న్ గా నియమించ‌డం ప‌ట్ల పీఎం మోడీకి, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు బీఆర్ నాయుడు.