హిమాయత్ నగర్ లోని శ్రీ వేంకటేశ్వర ఆలయం
తిరుమల – హైదరాబాద్ లోని హిమయత్ నగర్ లోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ఆలయం 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు టిటిడి ఛైర్మెన్ బీఆర్ నాయుడు. తిరుమలలోని టిటిడి ఛైర్మెన్ ఛాంబర్ లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మెన్ మాట్లాడుతూ హైదరాబాద్ హిమయత్ నగర్ లోని ఎస్వీ ఆలయంలో జూన్ 03వ తేదీ నుండి 07వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయన్నారు. వేసవి నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, తాగునీరు, ఆకర్షణీయంగా విద్యుత్ అలంకరణలు తదితర ఏర్పాట్లను అధికారులు సమిష్టిగా, సమన్వయంతో చేపట్టాలని సూచించారు. జూన్ 2వ తేదీ సాయంత్రం 06 గం.ల నుండి రాత్రి 9.00 గం.ల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుందని తెలిపారు. జూన్ 3వ తేదీ ఉదయం 06.30 గం.ల నుండి 8.45 గం.ల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణం జరుగనుందని పేర్కొన్నారు.
వాహన సేవల వివరాలు
జూన్ 03వ తేదీన ఉదయం 10 – 11 గం.ల వరకు శేష వాహనం, రాత్రి 08.00 – 09.00 గం.ల వరకు హనుమంత వాహనం.
జూన్ 04వ తేదీన ఉదయం 8.30 గం.లకు సూర్యప్రభ వాహనం, రాత్రి 08 గం.లకు చంద్రప్రభ వాహనం
జూన్ 05వ తేదీ ఉ. 8.30 గం.లకు గజ వాహనం, ఉదయం 10.30 గం.లకు శ్రీవారి శాంతి కల్యాణం, రాత్రి 08 గం.లకు గరుడ వాహనం
జూన్ 06వ తేదీ ఉ. 08.30 గం.లకు రథోత్సవం, రాత్రి 08 గం.లకు అశ్వ వాహనం
జూన్ 07వ తేదీ ఉదయం 11.30 గం.లకు చక్రస్నానం, సాయంత్రం 06 గం.లకు పుష్పయాగం, రాత్రి 09 గం.లకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నప్రసాద వితరణ జరుగనుందని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్.
ఈ కార్యక్రమంలో టెంపుల్ ఏఈవో యు. రమేష్ ఇతర అధికారులు పాాల్గొన్నారు.