క్యూ లైన్ ను పరిశీలించిన చైర్మన్
బీఆర్ నాయుడు భక్తులకు పరామర్శ
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు మంగళవారం ఆకస్మికంగా తిరుమలలో తనిఖీ చేశారు. సామాన్య భక్తుల క్యూ లైన్ వద్దకు వెళ్లారు. వసతి సౌకర్యాల ఏర్పాట్లపై ఆరా తీశారు.
చైర్మన్ ముందుగా ఏటీజీహెచ్ ( ATGH) వద్ద ఉన్న స్లాటెడ్ సర్వ దర్శనం ప్రవేశ మార్గం వద్ద పరిస్థితులను , అనంతం నారాయణగిరి ఉద్యాన వనంలోని షెడ్లను, దివ్య దర్శనం కాంప్లెక్స్ ల వద్ద అమలవుతున్న విధానాల గురుంచి సంబంధిత అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
అలాగే రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ వద్ద భక్తులతో మాట్లాడారు. దర్శన విధానానికి సంభందించి పలు సూచనలు భక్తుల నుండి స్వీకరించారు….త్వరలో దర్శన విధానాలపై సమగ్రంగా సమీక్షించి..సదుపాయాలు మెరుగు పరిచే విధంగా చర్యలు తీసుకుంటామని భక్తులకు హామీ ఇచ్చారు బీఆర్ నాయుడు.
అంతకు ముందు తిరుపతిలోని తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నారు. అమ్మ వారిని దర్శించుకున్నారు. గజ వాహన సేవలో పాల్గొన్నారు.