DEVOTIONAL

టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు

Share it with your family & friends

అన‌ధికార హాక‌ర్ల‌ను తొల‌గించాలి
తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ బీఆర్ నాయుడు దూకుడు పెంచారు. ఆయ‌న ముందుగా చెప్పిన‌ట్టుగానే తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అందులో భాగంగానే విస్తృతంగా ఆల‌య ప్రాంగ‌ణంతో పాటు ఇత‌ర ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించారు.

బుధ‌వారం తానే స్వ‌యంగా రంగంలోకి దిగారు. తిరుమ‌ల‌లో ఆక‌స్మిక తనిఖీలు చేప‌ట్టారు. వరాహస్వామి అతిథి గృహం వద్ద దుకాణాలు, హాకర్ లైసెన్సులను పరిశీలించారు టీటీడీ చైర్మ‌న్. తిరుమల అందాలను చెడగొట్టేలా ఇష్టానుసారం ఆక్రమణలు చేప‌ట్టిన‌ట్టు గుర్తించారు.

దీంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీఆర్ నాయుడు. అనధికార హాకర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు . టీటీడీ నిభందనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని స్ప‌ష్టం చేశారు. లేక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని, కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు టీటీడీ చైర్మ‌న్ .