DEVOTIONAL

వేంక‌టేశ్వ‌ర ఆడియో ఆల్బ‌మ్ ఆవిష్క‌ర‌ణ

Share it with your family & friends

ఆవిష్క‌రించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు

తిరుమ‌ల – తిరుమ‌ల‌లో శ‌నివారం తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) చైర్మ‌న్ బీఆర్ నాయుడు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి స్త్రోత్రం ఆడియో ఆల్బ‌మ్ ను ఆవిష్క‌రించారు. తిరుమ‌ల‌లోని చైర్మ‌న్ క్యాంపు ఆఫీసులో ఎనిమిది ఏళ్ల వ‌య‌సు క‌లిగిన నియార ఈ ఆల్బ‌మ్ ను ఆలాపించింది.

బాల గాయని నియార నాగ సుంకరినేని ఈ పాటను ఆలపించింది. ఈ పాటకు నిటార నాగ సుంకరినేని అనే చిన్నారి వయోలిన్ సహకారం అందించింది. ఈ ఆల్బమ్ కు డాక్టర్ కె.స్వరూపా సంగీత సమర్పకులుగా వ్యవహరాంచారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రావ్యమైన సంగీతంతో పాటను మధురంగా గానం చేశారని చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బొల్లినేని రవీంద్రనాథ్, గాయని తల్లిదండ్రులు డాక్టర్ నిష్మా సుంకరినేని, నిఖిల్ సుంకరినేని పాల్గొన్నారు.