లోకేష్ ను కలిసిన బీఆర్ నాయుడు
మర్యాద పూర్వకంగా కలిశానన్న చైర్మన్
అమరావతి – తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన టీవీ5 వ్యవస్థాపకుడు, అధిపతి బీఆర్ నాయుడు ఏపీ విద్యా , ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను సచివాలయంలో కలుసుకున్నారు .
ఇటీవలే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చైర్మన్ తో పాటు 24 మంది సభ్యులను నియమించింది. ఇటీవలే చైర్మన్ తో పాటు మిగతా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా బీఆర్ నాయుడును అభినందించారు మంత్రి నారా లోకేష్.
ఇదిలా ఉండగా అంతకు ముందు తనకు అత్యున్నతమైన టీటీడీ పదవిని కట్టబెట్టినందుకు గాను సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరూ కొద్దిసేపు వివిధ అంశాలపై చర్చించారు. తిరుమలలో పవిత్రతను కాపాడాలని స్పష్టం చేశారు చంద్రబాబు. చైర్మన్ తో పాటు సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని స్పష్టం చేశారు.
గతంలో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా ప్రస్తుతం కొలువు తీరిన ధర్మకర్తల మండలిపై బాధ్యత ఎక్కువగా ఉంటుందని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. మీరు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, తిరుమలకు పూర్వ వైభవాన్ని తీసుకు వస్తామని, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు బీఆర్ నాయుడు సీఎంకు.