DEVOTIONAL

త‌ల‌సానిని క‌లిసిన బీఆర్ నాయుడు

Share it with your family & friends

అభినందించిన మాజీ మంత్రి

హైద‌రాబాద్ – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నూత‌న చైర్మ‌న్ గా నియ‌మితులైన బీఆర్ నాయుడు మ‌ర్యాద పూర్వ‌కంగా మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ను క‌లిశారు. బుధ‌వారం ఆయ‌న నివాసంలో వీరిద్ద‌రూ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా బీఆర్ నాయుడును సాద‌రంగా ఆహ్వానించారు.

ఆయ‌న‌ను అభినందించారు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. పుష్ప గుచ్ఛం ఇచ్చి..శాలువ‌తా స‌త్క‌రించారు. ఈ సంద‌ర్బంగా వీరిద్ద‌రూ కొద్ది సేపు మాట్లాడుకున్నారు. బీఆర్ నాయుడు హ‌యాంలో తిరుమ‌ల క్షేత్రం మ‌రింత ఎద‌గాల‌ని కోరారు.

సామాన్య భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని కోరారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో ఇబ్బందులు ప‌డుతూ పుణ్య క్షేత్రానికి చేరుకుంటార‌ని, వారంద‌రికి మ‌రిన్ని వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించాల‌ని సూచించారు.

ఆ క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి , అలివేలు మంగ‌మ్మ‌లు ఎల్ల‌వేళ‌లా మీకు అండ‌గా నిల‌వాల‌ని, ఆరోగ్యాన్ని, మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను ఇవ్వాల‌ని కోరారు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. త‌న‌ను అభినందించిన త‌ల‌సాని కి ధన్య‌వాదాలు తెలిపారు బీఆర్ నాయుడు.