కుటుంబ సమేతంగా స్వామి వారి దర్శనం
తిరుపతి – శ్రీకాళహస్తీశ్వరున్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీ.ఆర్.నాయుడు దంపతులు . ఆలయం వద్దకు చేరుకున్న బీ.ఆర్.నాయుడు కుటుంబ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు.
క్షేత్ర పాలకుడు దక్షిణామూర్తిని మొదటగా దర్శించుకున్న టిటిడి ఛైర్మన్ కు దర్శనానంతరం వేద పండితులు టిటిడి ఛైర్మన్ ను ఆశీర్వదించారు. అనంతరం స్వామి, అమ్మ వార్ల చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్ మాట్లాడుతూ, ఆలయంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయని అభినందించారు. విద్యుత్, పుష్పాలంకరణలు ఆధ్యాత్మిక భావాన్ని మరింతగా పెంపొందిస్తున్నాయని తెలిపారు. మహా శివ రాత్రి పర్వదినం రోజున ఆలయాన్ని దర్శించు కోవడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఇది జీవితంలో మరిచి పోలేని అనుభూతిని మిగిల్చేలా చేసిందన్నారు.