Sunday, April 20, 2025
HomeDEVOTIONALఆమె లేక పోతే మ‌నం లేం

ఆమె లేక పోతే మ‌నం లేం

టీటీడీ చైర్మ‌న్ భూమ‌న

తిరుప‌తి – మూడు లక్షల సంవత్సరాల క్రితం టాంజానియా దేశంలో లూసీ అనే మహిళ ప్రసవించిన పిల్లల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మానవ జాతి వ్యాప్తి చెందిందని పరిశోధనల ద్వారా తెలుస్తోందని, ఈ రకంగా మానవ నాగరికతకు మహిళ బీజాలు వేసిందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు టీటీడీ ఛైర్మన్. పురాణాల ప్రకారం ఆది దేవత మహిళ అన్నారు. చాలా గ్రామాల్లో గ్రామ దేవతలు మహిళలని గుర్తు చేశాఉ. చరిత్రలో చాలామంది రాణులు చక్కటి రాజ్య పాలన చేశారని, ఆధునిక కాలంలో సిరిమావో బండారు నాయకే, ఇందిరాగాంధీ, మార్గరెట్ థాచర్ లాంటి మహిళా మణులు దేశ ప్రధానులుగా తమ దైన ముద్ర వేశారని చెప్పారు.

వేద కాలంలో గార్గి, మైత్రేయి లాంటి వారు జ్ఞానానికి మారు పేరుగా నిలిచారని వివరించారు. భారతీయ సమాజం మొదట్లో మాతృస్వామిక వ్యవస్థగా ఉండేదని, క్రమంగా పితృ స్వామిక వ్యవస్థగా మారిందని చెప్పారు. వర్తమాన సమాజంలో మహిళలు ఆయా రంగాల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ముందుకు వెళ్తున్నారని కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments