తిరుమలలో పాలిమారు మఠం పీఠాధిపతి
తిరుమల – పాలిమారు మఠం పీఠాధిపతి విద్యాదీశ తీర్థ స్వామిజీ, భీమనకట్టె మఠం పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థ స్వామిజీలను తిరుమలలోని వ్యాసరాజ మఠంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలు, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చైర్మన్ స్వామీజీలకు వివరించారు. భక్తులు సంతృప్తిగా తిరుమల యాత్రను పూర్తి చేసుకునేలా టీటీడీ పని చేయాలని పీఠాధిపతులు చైర్మన్ కు సూచించారు. శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ తలపెట్టే అన్ని కార్యక్రమాలు సఫలీకృతం కావాలని స్వామీజీలు ఆశీస్సులు అందజేశారు.
అనంతరం చైర్మన్ ను స్వామీజీలు పట్టు శాలువతో సన్మానించి, మహా భారతం గ్రంథాన్ని బహుకరించి ఆశీర్వదం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు నరేష్ కుమార్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీవారి అన్న ప్రసాదంలో వడను చేర్చుతున్నట్లు ప్రకటించారు బీఆర్ నాయుడు. ఈ సందర్బంగా లక్షలాది మంది భక్తులు టీటీడీ చైర్మన్ కు, ఈవోకు, పాలక మండలికి ధన్యవాదాలు తెలిపారు.