దర్శన ఏర్పాట్లపై భక్తులతో ఆరా
తిరుమల- తిరుమలలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఆలయం ముందు శ్రీవారిని దర్శించుకున్న భక్తులతో మాట్లాడారు. దర్శన ఏర్పాట్లపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. లడ్డూ, అన్న ప్రసాదాలు చాలా రుచికరంగా ఉన్నాయని చైర్మన్ వద్ద భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఆలయంలోని దర్శన క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న అన్న ప్రసాదం, తాగునీటి సదుపాయాలపై ఆరా తీశారు. క్యూలైన్లలోని భక్తులతో సేవాభావంతో నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, నరేష్ కుమార్, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.