చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్
తిరుపతి జిల్లా – తిరుపతి లోని అలిపిరి టోల్ గేట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ వి హర్షవర్ధన్ రాజు. వాహనాల తనిఖీలలో అప్రమత్తంగా ఉండాలన్నారు. టోల్ గేట్ లో భక్తులు తిరుమల చేరుకునేందుకు ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకొవాలని స్పష్టం చేశారు. అలిపిరి టోల్ గెట్ వద్ద విఐపి వాహనాలు, సామాన్య ప్రజల కార్లు వెళ్లే మార్గంతో పాటు ద్విచక్ర వాహనాలు వెళ్లే మార్గాలను పరిశీంచి పలు సూచనలు చేశారు.
తిరుమలకు వెళుతున్న ద్విచక్ర వాహనాలు, కార్లులను సిబ్బంది చెకింగ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాలు వెళ్ళుతున్న సమయంలో స్కానింగ్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు.
అదేవిధంగా తిరుమలకు వస్తున్న భక్తుల బ్యాగులు, ఇతర వస్తువులు వస్తున్న స్కానింగ్ ను నిశ్చింతగా పరిశీలించి.. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలిపిరి వద్ద ఉన్న సిసి కెమెరాను పరిశీలించి.. సిబ్బంది కి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రవి మనోహర్ ఆచారి, సదాలక్ష్మి వి ఎస్ ఓ, రమేష్ కృష్ణన్ ఏవి అండ్ ఎస్ ఓ, పురుషోత్తం విఐ, శ్రీ రామకృష్ణ ఎస్ విఎఫ్ ఆర్ ఐ, శ్రీలత డిఎస్పి మహిళ, తిరుపతి టౌన్, సుబ్రహ్మణ్యం సి. ఐ.డి.సి.ఆర్. బి, సాధిక్ ఆలి సీ.ఐ., టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.