5న డయల్ యువర్ టీటీడీ ఈవో
భక్తులు సలహాలు..సూచనలు ఇవ్వవచ్చు
తిరుమల – శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఎప్పటి లాగే ప్రతి నెలా టీటీడీ కార్యనిర్వహణ అధికారి (ఈవో) ఆధ్వర్యంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం కొనసాగుతూ వస్తోంది.
ఇందులో భాగంగా ఈ నెల ఏప్రిల్ 5వ తేదీన టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి ఆధ్వర్యంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరుగుతుందని టీటీడీ అధికారికంగా వెల్లడించింది. ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని మీటింగ్ హాల్ లో జరగనుందని పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలిపింది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి భక్త బాంధవులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఏవీ ధర్మా రెడ్డికి ఫోన్ ద్వారా తెలియ చేయాలని సూచించింది టీటీడీ. ఈ మేరకు భక్తులు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0877-2263261కు కు సంప్రదించాలని పేర్కొంది.