ఉదయం 9 నుండి 10 గంటల వరకు
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుందని తెలిపింది.
ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జె.శ్యామలరావుకు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని సూచించింది.
ఇప్పటికే కీలకమైన మార్పులు టీటీడీ తీసుకు వచ్చిందని, టెక్నాలజీ పరంగా చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా సాధ్యమైనంత త్వరలోనే శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రతి నెలా నెలా డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. భక్తులు 0877-2263261 అనే నెంబర్ లో సంప్రదించాలని టీటీడీ సూచించింది.