ప్రకటించిన టీటీడీ
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ప్రతి నెల నెలా డయల్ యువర్ ఈవో (కార్య నిర్వహణ అధికారి) కార్యక్రమం చేపడుతూ వస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు నిత్యం శ్రీ వేంకటేశ్వర స్వామి, అమ్మ వారిని దర్శించుకుంటారు. టీటీడీ భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తోంది.
అంతే కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. సిబ్బంది, ఉద్యోగలుతో పాటు వేలాది మంది శ్రీవారి సేవకులు విశిష్ట సేవలు అందజేస్తున్నారు. ఇదే సమయంలో భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేదా సలహాలు , సూచనలు ఇవ్వాలని అనుకుంటే ఈవోతో ఫోన్ ద్వారా మాట్లాడే వీలును కల్పించింది టీటీడీ పాలకమండలి.
తాజాగా టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈనెల 2వ తేదీన శుక్రవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగుతుందని తెలిపింది. ఈ కార్యక్రమాన్నిశ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని పేర్కొంది.
భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని సూచించింది. భక్తులు 0877-2263261 అనే నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపింది టీటీడీ.