Saturday, April 12, 2025
HomeDEVOTIONALఅనాధ బాల బాలిక‌ల‌కు ఆహ్వానం

అనాధ బాల బాలిక‌ల‌కు ఆహ్వానం

దేవ‌స్థాన విద్యాశాఖాధికారి పిలుపు

2025-26 విద్యా సంవత్స‌రానికి గాను ఎస్వీ బాలమందిరం నందు అనాధ బాల బాలికలను చేర్చుకొనేందుకు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుదారు హిందువు”అయి ఉండి, 10.04.2025 నాటికీ 5 సం|| దాటి 10 సం॥ లోపు వయస్సు కలిగి, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వారై ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు.

దరఖాస్తు దారులు తమ వివరాల‌ను తెల్ల కాగితంపై రాసి, త‌ల్లి, తండ్రి, మ‌ర‌ణ , విద్యార్థి జ‌న‌న తేదీ, కుల‌, సంర‌క్ష‌కుల త‌ల్లి, తండ్రి, ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు జిరాక్స్ కాపీల‌ను జ‌త చేసి ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌కు స‌మ‌ర్పించాల‌ని తెలిపారు.

ఏఈవో, ఎస్వీ బాల‌మందిరం, తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం, భ‌వానీ న‌గ‌ర్, తిరుప‌తి =517501 అనే చిరునామాకు స్వ‌యంగా కానీ లేదా పోస్ట్ ద్వారా కానీ స‌మ‌ర్పించాల‌ని తెలిపారు. ఇత‌ర వివ‌రాల‌కు ఫోన్ నెంబ‌ర్ 0877-2264612లో స‌మ‌ర్పించాల‌ని దేవ‌స్థాన విద్యా శాఖ అధికారి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments