DEVOTIONAL

జూలై 9, 16 తేదీల‌లో బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

Share it with your family & friends

టీటీడీ కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి జె. శ్యామ‌లా రావు

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమ‌ల పుణ్య క్షేత్రంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో జూలై 16న సాల‌క‌ట్ల ఆని వార ఆస్థానం ప‌ర్వ దినాన్ని ఘ‌నంగా నిర్వ‌హించ‌నుంద‌ని తెలిపారు టీటీడీ కార్య నిర్వ‌హ‌క అధికారి (ఈవో) జె. శ్యామ‌లా రావు.

ఇందులో భాగంగా ప‌ర్వ దినాన్ని పుర‌స్క‌రించుకుని జూలై 9వ తేదీన మంగ‌ళ వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని పేర్కొన్నారు. దీని కార‌ణంగా జూలై 9వ తేదీతో పాటు జూలై 16న శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి సంబంధించి బ్రేక్ ద‌ర్శ‌నాలు ఉండ‌ల‌ని స్ప‌ష్టం చేశారు జె. శ్యామ‌లా రావు.

దీని కార‌ణంగా జూలై 8వ తేదీతో పాటు 15వ తేదీల‌లో సిఫార‌సు లేఖ‌ల‌ను స్వీక‌రించ బోమంటూ స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని శ్రీ‌వారి భ‌క్తులు గ‌మ‌నించాల‌ని కోరారు టీటీడీ ఈవో.