జూలైలో హుండీ కానుకలు రూ. 125.35 కోట్లు
శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్న ప్రసాదాలు
తిరుమల – గత జూలై నెలలో శ్రీవారి ఆలయానికి గణనీయమైన ఆదాయం లభించిందని వెల్లడించారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి జె. శ్యామల రావు వెల్లడించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా ఆయన భక్తులు అడిగిన పలు ప్రశ్నలు, సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తిరుమలలోని హోటళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందివ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆహార పదార్థాల తయారీదారులు , హోటల్ సిబ్బందికి ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో శిక్షణ నిర్వహించినట్లు తెలిపారు. తిరుమలలోని హోటల్ యజమానులందరూ ఫుడ్ సేఫ్టీ విభాగం సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేశారు.
డయల్ యువర్ ఈవో అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. 1.04 కోట్ల శ్రీవారి లడ్డూలను విక్రయించడం జరిగిందని చెప్పారు. 24.04 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు ఈవో. 8.67 లక్షల మంది తలనీలాలు సమర్పించారని పేర్కొన్నారు.