Saturday, April 5, 2025
HomeDEVOTIONAL15న శ్రీ‌నివాస క‌ళ్యాణోత్స‌వం

15న శ్రీ‌నివాస క‌ళ్యాణోత్స‌వం

టీటీడీ ఈవో జె.శ్యామలరావు

అమ‌రావ‌తి – అమరావతిలోని శ్రీవారి ఆలయంలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. శ్రీనివాస కళ్యాణం సందర్భంగా ఆయన టీటీడీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్ర‌బాబు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌య నిర్మాణానికి 25 ఎక‌రాల స్థ‌లాన్ని 2019లో శంకుస్థాప‌న చేశార‌ని తెలిపారు. 2022లో ఈ ఆల‌యం అందుబాటులోకి వ‌చ్చిందన్నారు.
శ్రీవారి వైభవాన్ని నాలుగు దిశల వ్యాప్తి చేసేందుకు టీటీడీ శ్రీవారి కళ్యాణం ఉపయోగ పడుతుందని చెప్పారు.

ఈ సంద‌ర్బంగా ఈవో జె. శ్యామ‌ల రావు మీడియాతో మాట్లాడారు. 2018లో అమ‌రావ‌తిలో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌కు సంబంధించిన ఆల‌యానికి శ్రీ‌కారం చుట్టార‌ని వెల్ల‌డించారు.శ్రీవారి వైభవాన్ని నాలుగు దిశల వ్యాప్తి చేసేందుకు టీటీడీ శ్రీవారి కళ్యాణం ఉపయోగ పడుతుందని చెప్పారు.
ఈ క్రమంలో అమరావతిలోని భక్తులు పెద్ద ఎత్తున శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని కోరడంతో టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టిందన్నారు.

ఇదిలా ఉండ‌గా ఆరోజు నిర్వ‌హించే శ్రీవారి క‌ళ్యాణోత్స‌వానికి సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌ర‌వుతార‌ని వెల్ల‌డించారు ఈవో జె. శ్యామ‌ల రావు. ఈ కార్యక్రమానికి దాదాపు 25వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. భక్తులకు సంతృప్తికరంగా శ్రీవారి కల్యాణం వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులందరికీ తాగునీరు, మజ్జిగ, అన్న ప్రసాదాలు పంపిణీ చేనున్నట్లు తెలిపారు. భక్తులు స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ స్కీన్లు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అమరావతి ప్రాంతంలో ఈ కార్యక్రమంపై ఇప్పటికే శ్రీవారి ధర్మ రథాలతో ప్రచారం చేస్తున్నామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భక్తి సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానల్ లో ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, దేవాదాయశాఖ కార్యదర్శి వినయ్ చంద్, జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, దేవాదాయ శాఖ ఇంఛార్జి కమిషనర్ రామచంద్ర మోహన్, జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, ఎస్పీ సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments