ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల – శ్రీవారి భక్తులకు బిగ్ షాక్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). సోమవారం కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 18న శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం రద్దు చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి భక్తులు గమనించాలని కోరింది.
ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు 17వ తేది రాత్రి వరకు జరగనున్నాయి. ఈ కారణంగా 18వ తేదీ కళ్యాణోత్సవాన్ని రద్దు చేసినట్లు టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి జె. శ్యామల రావు తెలిపారు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీతో సహకరించాలని కోరారు. ఇదే సమయంలో నిర్దేశించిన సమయం కంటే ముందు వచ్చే భక్తులను దర్శనానికి సంబంధించి అనుమతించ బోమంటూ పేర్కొన్నారు. దీని వల్ల అధిక సమయం పడుతోందని , దయచేసి గుర్తించాలని స్పష్టం చేశారు ఈవో.