DEVOTIONAL

టీటీడీ ఆధ్వ‌ర్యంలో విశిష్ట సేవ‌లు

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి

తిరుమ‌ల – టీటీడీ ఆధ్వ‌ర్యంలో భ‌క్తుల‌కు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి. తిరుమ‌ల‌లో ధార్మిక స‌ద‌స్సులో ఈవో పాల్గొని ప్ర‌సంగించారు. ధార్మిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంద‌న్నారు.

మనగుడి, శ్రావణ పౌర్ణమి, గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి, ఉగాది తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెట్టడం జ‌రిగింద‌న్నారు ఈవో. శ్రీవాణి ట్రస్ట్‌తో ఇప్పటి వరకు 689 ఆలయాలు నిర్మించిన‌ట్లు తెలిపారు. 1501 మంది గ్రామ యువకులకు అర్చక నైపుణ్యాలు, ఆలయాల్లో ధూప, దీప కార్యక్రమాలకు నెలకు రూ.5000 ఆర్థిక సహాయం అంద‌జేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు.

బ్రహ్మోత్సవాలు, వైకుంఠ సందర్భంగా మారుమూల ప్రాంతాల నుంచి దాదాపు 29,298 మందిని తిరుమలకు శ్రీవారి దర్శనానికి తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు. గుడికో గోమాత కార్యక్రమం కింద 194 దేవాలయాలకు ఆవులు, దూడలను అందించి గోపూజను ప్రోత్సహించిన‌ట్లు చెప్పారు ధ‌ర్మా రెడ్డి.

దాస సాహిత్య ప్రాజెక్టు కింద 680 దాస సంకీర్తనలను రికార్డు చేసి 80 పుస్తకాలను ప్రజా ప్రయోజనార్థం రూపొందించి పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌న్నారు ఈవో. 225 మంది పారాయణదారులు వైష్ణవ దేవాలయాలలో దివ్య ప్రబంధ పారాయణాలు చేస్తారని తెలిపారు. 962 శ్రీనివాస కల్యాణాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. .

1308 మంది వేద పండితులు, 60 మంది వృద్ధులు, 119 మంది ఆగమ పండితులు, 15 మంది అహితాగ్నిలు, 110 మంది మరణించిన పండితులకు గౌరవ వేతనాలు ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్నమాచార్య ప్రాజెక్ట్ సంగీత, హరికథ కార్యక్రమాలలో 340 మంది కళాకారులతో 29 సంపుటాలలో 4530 సంకీర్తనలను రికార్డ్ చేసిందన్నారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టులో 114 రచనలు నమోదు చేశామ‌న్నారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టులో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 437 మంది విద్యార్థులు, టీటీడీకి చెందిన కీసరగుట్ట, విజయనగరం, భీమవరం కోటప్పకొండ, నల్గొండ వేద పాఠశాలల్లో ఎనిమిది పురాణాలను ప్రచురించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు ధ‌ర్మా రెడ్డి.