ధర్మా రెడ్డి రాష్ట్రం దాటి వెళ్లొద్దు
టీటీడీ ఈవోకు బిగ్ షాక్
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనను రాష్ట్రం దాటి వెళ్ల వద్దంటూ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. మంగళవారం కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈవోగా ఉన్న ధర్మా రెడ్డి తనకు సెలవు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తనకు సెలవు ఇవ్వడం కుదరదంటూ పాత సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు.
దీంతో ఈవో ధర్మా రెడ్డి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగన్ మోహన్ రెడ్డి మద్దతుతో అర్హత లేక పోయినా ఈవోగా బాధ్యతలు చేపట్టారని, తిరుమలను సర్వ నాశనం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాక పోయినా ఎలా బాధ్యతలు చేపట్టారంటూ ప్రశ్నించారు.
ఇదే సమయంలో జనసేన పార్టీ నాయకులు తిరుపతిలోని సీఐడీ కార్యాలయంలో ఈవో ఏవీ ధర్మా రెడ్డిని ఎక్కడికీ వెళ్లనీయవద్దని, లెక్కలు చూపిన తర్వాతే పంపించాలని కోరారు. దీంతో సెలవు మంజూరు చేస్తూనే, రాష్ట్రం దాటి వెళ్లవద్దంటూ హుకూం జారీ చేశారు.