DEVOTIONAL

జెర్రీ ప‌డింద‌న్న‌ది పూర్తిగా అబ‌ద్దం – టీటీడీ

Share it with your family & friends

కావాల‌ని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపణ

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా తిరుమ‌ల‌లోని అన్న ప్ర‌సాదంలో జెర్రీ ప‌డిందంటూ పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు రావ‌డాన్ని, ప్ర‌చారం చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ మేర‌కు ఈవో జె. శ్యామ‌ల రావు ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు.

అన్న ప్రసాదంలో జెర్రీ పడిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారం త‌ప్ప మ‌రోటి కాద‌ని పేర్కొన్నారు. మాధవ నిలయంలోని అన్నప్రసాదంలో తాము తిన్న అన్నప్రసాదంలో జర్రి కనబడిందని ఒక భక్తుడు చేసిన ఆరోపణలు వాస్తవ దూరమ‌ని స్ప‌ష్టం చేశారు ఈవో.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వేలాది మంది భక్తులకు వడ్డించడానికి పెద్ద మొత్తంలో టిటిడి అన్న ప్రసాదాలను తయారు చేస్తోంద‌ని తెలిపారు.

అంత వేడి అన్న ప్ర‌సాదంలో ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఒక జెర్రీ ఉందని సదరు భక్తుడు పేర్కొనటం ఆశ్చర్యకరమ‌ని పేర్కొన్నారు.

ఒకవేళ పెరుగు అన్నాన్ని కలపాలంటే కూడా ముందుగా వేడి చేసిన అన్నాన్ని బాగా కలియపెట్టి తరువాత పెరుగు కలుపుతారు. అటువంటప్పుడు ఏమాత్రం రూపు చెదరకుండా జర్రి ఉండటం అనేది విస్మ‌యం క‌లిగిస్తోంద‌ని అన్నారు. ఇది పూర్తిగా కావాలని చేసిన చర్య మాత్రమే గా భావించాల్సి వస్తుందని స్ప‌ష్టం చేశారు.

దయచేసి భక్తులు ఇటువంటి సత్యదూర వార్తలను నమ్మ వ‌ద్ద‌ని టీటీడీ ఈవో కోరారు.