DEVOTIONAL

శ్రీ‌వారి భ‌క్తుల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు పెద్ద‌పీట‌

Share it with your family & friends

త‌నిఖీల‌తో హోరెత్తించిన ఈవో శ్యామ‌ల రావు

తిరుమ‌ల – రాజ‌కీయాల‌కు కేరాఫ్ గా మారిన తిరుమ‌ల‌లో ఇప్పుడు సీన్ మారింది. నూత‌న ప్ర‌భుత్వం సీనియ‌ర్ ఐఏఎస్ జె. శ్యామ‌ల రావును నియ‌మించింది. ఆయ‌న వ‌చ్చాక దూకుడు పెంచారు. భ‌క్తులకు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో ఉండేలా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌ను విస్తృతంగా త‌నిఖీలు చేప‌డుతూ హోరెత్తిస్తున్నారు. ద‌ళారీల గుండెల్లో రైళ్లు ప‌రుగెతిస్తున్నారు.

తాజాగా ⁠ఎఫ్‌ఎస్‌డి అధికారుల బృందంతో కలిసి తిరుమ‌ల‌లోని హోటళ్ల‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నాసిరకం కూరగాయలు, ముడి సరుకులు ఉన్న‌ట్టు గుర్తించారు. ⁠ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించిన హోటళ్ల య‌జ‌మానుల‌పై సీరియ‌స్ అయ్యారు. తీరు మార్చుకోక పోతే క‌ఠిన చ‌ర్య‌లు తప్ప‌వంటూ వార్నింగ్ ఇచ్చారు ఈవో జె. శ్యామ‌ల రావు.

తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోందనిఈ సంద‌ర్బంగా ఈవో స్ప‌ష్టం చేశారు. కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్‌ఎస్‌డి) అధికారుల బృందంతో కలిసి తనిఖీ చేశారు.

హోటల్‌లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్ర పరచడం తదితర పద్ధతులను పరిశీలించారు. బంగాళ దుంపలు, కాలీఫ్లవర్, కొన్ని కిరాణా సామాగ్రితో సహా చాలా కూరగాయలు కుళ్ళి పోయినట్లు గుర్తించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉన్న‌ట్లు గుర్తించారు ఈవో.

కొందరు శ్రీవారి భక్తులు తిరుమల హోటల్‌లో భోజనం చేసి అస్వస్థతకు గురయ్యారని, యాత్రికుల నుంచి వరుసగా వచ్చిన ఇ- మెయిల్‌ల ఫిర్యాదుల నేపథ్యంలో తాను ఎఫ్‌ఎస్‌డి బృందంతో కలిసి హోటల్‌ను ఆకస్మికంగా తనిఖీలు చేశామని చెప్పారు. హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని, అపరిశుభ్రత పరిస్థితుల మధ్య హోటల్‌లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తేలింద‌న్నారు.