స్పష్టం చేసిన టీటీడీ ఈవో శ్యామల రావు
తిరుమల – టీటీడీ ఈవో జె. శ్యామల రావు కీలక ప్రకటన చేశారు. శ్రీవారి భక్తులకు శుభ వార్త చెప్పారు. జనవరి 23 నుంచి తిరుపతిలో ఏ రోజుకు ఆరోజు ఎస్ఎస్ డీ టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు. అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే ఎస్ ఎస్ డి టోకెన్లను భక్తులు పొందవచ్చని స్పష్టం చేశారు. క్యూ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి టోకెన్లు దక్కుతాయని తెలిపారు.
ఇదిలా ఉండగా ఇటీవల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనలో ఆరు మంది చని పోగా 32 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు భారీ ఎత్తున ప్యాకేజీ ప్రకటించారు. బాధిత కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తానని ప్రకటించారు.
ఇప్పటికే ఆర్థిక సాయం అందించడం జరుగుతోందని తెలిపారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.