టీటీడీలో ఈవో ప్రక్షాళన
తనిఖీలు..సమీక్షలతో ఫోకస్
తిరుమల – తిరుమలలో రాజకీయాలకు తావు ఉండ కూడదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన కొలువు తీరిన వెంటనే శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. అనంతరం తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తిరుమలలో ఓం నమో వేంకటేశ్వరాయ నమః అన్న పదం తప్ప ఇంకే పదం వినిపించేందుకు వీలు లేదని స్పష్టం చేశారు.
ఈ తరుణంలో గతంలో తిరుమలను భ్రష్టు పట్టించిన చరిత్ర ఈవోగా ఉన్న ధర్మా రెడ్డిది. ఆయనపై లెక్కలేనన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. గత వైసీపీ సర్కార్ నిధులను పక్కదారి పట్టించారని కూడా జనసేన పార్టీ ఆరోపించింది.
ఇదే సమయంలో ఈవోగా కొలువు తీరారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ జె. శ్యామలా రావు. ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే దూకుడు పెంచారు. వరుసగా సమీక్షలు, తనిఖీలతో హోరెత్తిస్తున్నారు.
నారాయణగిరి షెడ్లను ఈవో పరిశీలించారు. యాత్రీకుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడం గురించి కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు.
తిరుమలలో గత ఐదేళ్లుగా నిలిచి పోయిన సౌకర్యాలను తిరిగి పునరుద్దరించారు.