తిరుమల పవిత్రత పెంచేలా చర్యలు
తిరుమల – తిరుమలలో పవిత్రతను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టిటిడి) ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈవో) జె. శ్యామల రావు . శనివారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి తిరుమల పుణ్య క్షేత్రానికి వస్తుంటారని, వారికి వసతి సౌకర్యాలను కల్పించేందుకు ఫోకస్ పెడుతున్నామని పేర్కొన్నారు. అంతే కాకుండా తిరుమల పుణ్య క్షేత్రం పవిత్రతను పెంపొందించేలా చర్యలు చేపతామని స్పష్టం చేశారు జె. శ్యామల రావు.
తాను ఈవోగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి దాకా విస్తృతంగా తనిఖీలు, సమీక్షలు చేపడుతూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా భక్తుల ఆరోగ్యానికి పెద్ద పీట వేశామని పేర్కొన్నారు.
ఇదే సమయంలో భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని తెలిపారు ఈవో. సాధ్యమైనంత త్వరగా స్వామి వారి దర్శనం కలిగించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు . దర్శన టికెట్ల కేటాయింపునకు సంబంధించి పూర్తి పారదర్శకత ఉండేలా చూస్తున్నామని పేర్కొన్నారు జె. శ్యామలా రావు.