తిరుమలలో భక్తులకు అందిస్తున్న సేవలు భేష్
టీటీడీఓను ప్రశంసించిన వ్యాసరాజ మఠాధిపతి
తిరుమల – తిరుమలలో శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశతీర్థ స్వామీజీ.
తిరుమలకు విచ్చేసిన వ్యాసరాజ మఠాధిపతి స్వామీజీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు టీటీడీ ఈవో జె. శ్యామలరావు దంపతులు. ఈ సందర్బంగా వారికి ఆశీర్వచనాలు అందజేశారు శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీశతీర్థ స్వామీజీ.
ఇటీవల కాలంలో భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని ఈవోను స్వామీజీ ప్రత్యేకంగా అభినందించారు. ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు. ప్రధానంగా తిరుమల పవిత్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆ కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మల ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని స్పష్టం చేశారు శ్రీ స్వామీజీ. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా హిందూ మతం విశిష్టత గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు వ్యాసారజ మఠాధిపతి .