తిరుమలలో మొబైల్ ల్యాబ్ ప్రారంభం
ప్రారంభించిన టీటీడీ ఈవో శ్యామల రావు
తిరుమల – తిరుమలలో నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్ , ఫ/డ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ను ప్రారంభించారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈవో) జె. శ్యామల రావు. ఈవోతో పాటు ఎఫ్ఎస్డీ డైరెక్టర్ కలిసి ప్రారంభించారు.
దీనిని ప్రత్యేకంగా వసతి సౌకర్యాలతో తయారు చేశారు. ఈ వాహనం ఆహారం, నీటి నాణ్యతను తనిఖీ చేయడానికి అవసరమైన పరికరాలతో కూడిన ల్యాబ్‌ను కలిగి ఉంది. ఈ మొబైల్ ల్యాబ్‌లో 80 రకాల పదార్థాల నాణ్యతలను తనిఖీ చేస్తారు. దీనిని ప్రత్యేకంగా తిరుమలలో ఆహారం, నీరు నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు వినియోగిస్తారని ఈ సందర్బగా స్పష్టం చేశారు ఈవో జె. శ్యామల రావు.
ఈ కార్యక్రమంలో ఎస్ఈ 2 జగదీశ్వర్ రెడ్డి, తిరుమల ఎస్టేట్స్ ఆఫీసర్ విజయ లక్ష్మి, డీఈ ఎలక్ట్రికల్ రవిశంకర్ రెడ్డి, ఏఈవో రెవెన్యూ శ్రీ చౌదరి ఉన్నారు. అదే విధంగా తిరుపతి జిల్లా ఫుడ్ కంట్రోలర్వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ఫుడ్ కంట్రోలర్ గౌస్ మొహియుద్దీన్ , పశ్చిమ గోదావరి జిల్లా ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాసరావు, తిరుమల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగదీష్ పాల్గొన్నారు.