స్పష్టం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుమల – టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే మే 01 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేసినట్లు స్పష్టం చేశారు ఈవో జె. శ్యామల రావు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టిటిడి మే 01 తారీకు నుండి పలు కీలక నిర్ణయాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందన్నారు.
ఇందులో భాగంగావీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేయనున్నట్లు స్పష్టం చేశారు జె. శ్యామల రావు. ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుండి అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తిరుమల పుణ్య క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామన్నారు. నిరభ్యంతరంగా తమకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్యామల రావు.