DEVOTIONAL

క్యూ లైన్లను తనిఖీ చేసిన ఈవో

Share it with your family & friends

శ్యామ‌ల రావుకు స‌మ‌స్య‌ల వెల్లువ‌

తిరుమల – టీటీడీ నూత‌న ఈవోగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జె . శ్యామ‌ల రావు త‌న‌దైన శైలిలో దూకుడు పెంచారు. ఆయ‌న రాక‌తో ఒక్క‌సారిగా తిరుమ‌లలో వాతావ‌ర‌ణం మారి పోయింది. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఉన్న ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డిపై వేటు వేసింది కొత్త స‌ర్కార్. ప్ర‌ధానంగా కోట్లాది మంది ద‌ర్శించుకునే తిరుమ‌లలో క‌నీస సౌక‌ర్యాలు లేక పోవ‌డంపై దృష్టి సారించారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.

ఆయ‌న ఆదేశాల మేర‌కు ఈవో శ్యామ‌ల రావు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా తిరుమ‌ల లోని క్యూ లైన్లను ప‌రిశీలించారు. భ‌క్తుల‌తో సంభాషించారు. నారాయ‌ణ గిరి షెడ్లు, వైకుంఠ రంగ క్యూ కాంప్లెక్స్ ల‌ను చూశారు. భ‌క్తుల‌కు టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడారు. తన తొలి తనిఖీలో భక్తులకు టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాలు, తాగు నీరు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి భక్తుల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నట్లు చెప్పారు.

కొన్ని చోట్ల భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందుతుండగా, కొన్ని ప్రాంతాల్లో పాలు అందడం లేదని చెప్పినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు, షెడ్లలో వేచి ఉన్న వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

ఈవో వెంట జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్‌వో నరసింహ కిషోర్, సిఈవో షణ్ముఖ్ కుమార్, సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ 2 జగదీశ్వర్ రెడ్డి, డీవైసీఎఫ్ శ్రీనివాసులు, ఇతర అధికారులు ఉన్నారు.