DEVOTIONAL

కాంట్రాక్టు ఉద్యోగుల‌కు టీటీడీ తీపి క‌బురు

Share it with your family & friends

టీటీడీ పాల‌క మండ‌లి నిర్ణ‌యాలు

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి స‌ర్వ స‌భ్య స‌మావేశం అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో సోమ‌వారం ముగిసింది. ఈ మేర‌కు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఇందుకు సంబంధించి టీటీడీ చైర్మ‌న్ భూమన క‌రుణాక‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నడక దారిలోని గాలిగోపురం, ఆంజన్న విగ్రం, మోకాలి మెట్టు దగ్గర నిత్య సంకీర్తన అర్చ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు.

రూ. 1.69 కోట్లతో శ్రీవారి ఆలయంలో జయ విజయుల విగ్రహాల బంగారు తాపడం పనులకు ఆమోదం తెలిప‌డం జ‌రిగింద‌న్నారు. అంతే కాకుండా తిరుపతి ఆవిర్భావ దినోత్సవ వేడుకుల‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 24న నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొన్నారు భూమ‌న‌.

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో రూ. 3 కోట్లతో లైటింగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింద‌న్నారు. సప్తగిరి వసతి గదులు 1,4 బ్లాకుల ఆధునికీక‌ర‌ణ‌కు రూ. 3.11 కోట్లు మంజూరు చేసిన‌ట్లు చెప్పారు .

శ్రీలంకలోని కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాల‌ని, టీటీడీ కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగులకు 15 వేల మందికి రూ. 3 నుండి 20 వేల వరకు జీతాలు పెంచుతూ టీటీడీ బోర్డు తీర్మానం చేసింద‌న్నారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ ఉద్యోగుల క్యాంటీన్లో భోజనం ఉచితంగా అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. . రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇక మీదట రాయితీ ధరలతో వీరికి కూడా టిఫిన్, భోజనం, టీ, కాఫీ అందిస్తారని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంద‌న్నారు.