100 మంది భక్తులకు పెంచింది
తిరుమల – టీటీడీ తీపి కబురు చెప్పింది. ప్రవాస భారతీయ భక్తుల దర్శనానికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. దర్శనం కోసం వచ్చే ఎన్నారైలకు ప్రతి రోజూ 50 మందికి మాత్రమే అవకాశం ఉండేది. భక్తుల డిమాండ్ దృష్ట్యా దర్శనం సంఖ్యను 100కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్బంగా టీటీడీ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు ఎన్నారైలు.
ఇదిలా ఉండగా ప్రతి రోజూ వేలాది మంది తిరుమలలో కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుకు వస్తుంటారు. ప్రధానంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి హాజరవుతారు. ప్రతిరోజూ రెండున్నర కోట్ల నుంచి రూ. 3 కోట్ల దాకా శ్రీవారి హుండీ ద్వారా ఆదాయం లభిస్తోంది.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి. ఈ మేరకు నభూతో నభవిష్యత్ అన్న చందంగా చర్యలు చేపట్టింది. ఈనెల 4న రథసప్తమిని అంగరంగ వైభవంగా నిర్వహించింది టీటీడీ.