ధర్మం విశ్వ వ్యాప్తం కావాలి
హిందూ ధార్మిక సదస్సులో మఠాధిపతులు
తిరుమల – హిందూ ధర్మాన్ని విశ్వ వ్యాప్తం చేసేందుకు పీఠాధిపతులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు తిరుమలలో జరిగిన ధార్మిక సదస్సులో పిలుపునిచ్చారు. కేవలం దేశానికే కాదు, ప్రపంచమంతా భక్తి పారవశ్యంతో కీర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
పీఠాధిపతులు, వివిధ హిందూ మత సంస్థల పెద్దలు తమ సందేశాల ద్వారా హిందూ సనాతన ధర్మాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై టిటిడికి విలువైన సూచనలు అందించారు. టీటీడీ చైర్మన్ భూమన, ఈవో ధర్మా రెడ్డిలు తిరుమల అభివృద్ది కృషి చేస్తున్నారని ప్రశంసించారు వెదురు పాక స్వామీజీ.
గత ఐదేళ్లలో తిరుమలలో సామాన్య భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించడం అభినందనీయని పేర్కొన్నారు. ఈ జంట భవిష్యత్తులో కూడా తమ పదవుల్లో కొనసాగాలని, మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
సనాతన ధర్మం అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, పశువులు, మొక్కలు, జంతువులను కూడా సరైన పద్ధతిలో సమానంగా చూడాలని సూచించారు ముకుందా నంద్ మహారాజ్. గోమాతను విశ్వమాతగా ప్రచారం చేయాలన్నారు. ఆధునిక విద్యలో, మన సాంప్రదాయ హిందూ ధర్మం, సాంస్కృతిక విలువలను పిల్లలకు నేర్పించాలని కోరారు.
మారుమూల ప్రాంతాల్లో మత మార్పిడులు జరగకుండా టీటీడీ కృషి చేయాలని కోరారు మన్నార్ గుడి జీయర్ స్వామి. ధార్మిక సదస్సు ను నిర్వహించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు సుజయనిధి తీర్థ. దేశంలోని సాధువులను ఒక్క చోటుకు చేర్చడం అభినందనీయమన్నారు కన్నూరు మఠం పీఠాధిపతి విద్యా నంద స్వామి.
భావి తరాలకు ధర్మాన్ని అందించడానికి మరింత మెరుగైన కృషి జరగాలన్నారు రామకృష్ణ మఠం పీఠాధిపతి అనుపమానంద మహారాజ్. ధర్మాచరణ పట్ల యువతలో ఆసక్తి పెంపొందించాలని కోరారు. సంస్కృత భాషను ప్రోత్సహించాలని సూచించారు.
భారతీయ సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు తమిళనాడు లోని ఆళ్వార్ తిరునగరి పీఠాధిపతి ఎమ్బెరుమానార్ జీయర్ స్వామి, కమలానంద భారతీ స్వామి. ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి.