మే 30వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలో ప్రవేశాలకు 2025 -26 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది టీటీడీ. టిటిడి ఆధ్వర్యంలో నడప బడుచున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములు (పాఠశాలలు) 1. వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల 2. కీసరగుట్ట, 3. విజయనగరం, 4. ఐ. భీమవరం, 5. నల్గొండ, 6. కోటప్పకొండ నందు బోధింపబడు వివిధ కోర్సుల్లో ప్రవేశం కొరకు అర్హులైన బాలుర నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది.
అనగా వైదిక సంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి, నిర్ణీత వయస్సు, విద్యా ప్రమాణాలు కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపింది టీటీడీ. సదరు పాఠశాలల యందు బోధింపబడు వివిధ కోర్సుల వివరాలు, అర్హత, ఆవశ్యకత, దరఖాస్తు, ఇతర వివరాలకు టిటిడి వెబ్ సైట్ www.tirumala.org నందు ఉన్నాయని స్పష్టం చేసింది. ఆయా కోర్సులకు సంబంధించి మే 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.