Saturday, April 19, 2025
HomeDEVOTIONALటీటీడీ విద్యార్థులు స‌త్తా చాటాలి

టీటీడీ విద్యార్థులు స‌త్తా చాటాలి

జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుప‌తి – టీటీడీ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలని జెఈవో సదా భార్గవి కోరారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 31వ వార్షికోత్సవం ప్రిన్సిపాల్ డా. సి.భువనేశ్వరి అధ్యక్షతన ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో సదా భార్గవి ముందుగా విద్యార్థినుల తల్లిదండ్రుల సౌకర్యార్థం నిర్మించిన ధాత్రి సదన్ ను ప్రారంభించారు. అనంతరం జెఈవో మాట్లాడారు. నీట్, ఎంసెట్, లాసెట్, సిఎ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కోచింగ్ వసతి కల్పిస్తామన్నారు.

గత సంవత్సరం వచ్చిన ఫలితాలను అభినందించారు. ఈ ఫలితాల సాధనకు కారకులైన డీఈవోకు, ప్రిన్సిపాల్ కు అధ్యాపకులకు, విద్యార్థినులకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ సంవత్సరం 100 శాతం ఫలితాలు సాధించాలని కోరారు.

భక్తుల కానుకల ద్వారా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో, ఏకాగ్రతతో విద్యా బుద్ధులు నేర్చుకోవాలన్నారు. కళాశాలలో నిర్వహించే మెంటార్ షిప్, ప్రేరణ లాంటి కార్యక్రమాలను సద్వినియోగ పరుచు కోవాలని సూచించారు.

విద్యార్థినులకు నెలకోసారి తిరుమల స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. విద్యార్థినులు చదువుతో పాటు తమకు నచ్చిన రంగంలో రాణించేందుకు సాధన చేయాలన్నారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన టీటీడీ న్యాయాధికారి వై.వీర్రాజు మాట్లాడుతూ ఆహ్లాదకర వాతావరణంలో టీటీడీ విద్యను అందిస్తోందని, చక్కగా వినియోగించు కోవాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యార్థినులది సందిగ్ధ వయసు కావున అనేక ప్రభావాలు ఉంటాయని, అధ్యాపకులు, తల్లిదండ్రుల సలహాలను తప్పక పాటించాలని సూచించారు. కళాశాలలో చేరిన మొదటి రోజే దృఢమైన ఆశయం ఏర్పరచుకోవాలని, తల్లిదండ్రులు మీ గురించి గర్వంగా చెప్పుకునేలా ఎదగాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments