తిరుచానూరులో కియోస్క్ ప్రారంభం
ప్రారంభించిన జేఈవో వీరబ్రహ్మం
తిరుచానూరులోని అన్నదానం కాంప్లెక్స్‌లో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌ను ప్రారంభించారు. ఈ మెషిన్ భక్తుల నుండి రూ. 1లక్ష వరకు విరాళాలను స్వీకరిస్తుంది. కెనరా బ్యాంక్ కియోస్క్ మిషన్‌ను విరాళంగా ఇచ్చింది.
అంతకు ముందు తిరుమలలోని వెంగమాంబ అన్నదానం సత్రంలో మరో ప్రభుత్వరంగ బ్యాంకు కియోస్క్ ను ఏర్పాటు చేసింది. దీనిని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ఇదిలా ఉండగా భక్తుల సౌకర్యార్థం వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మరో వైపు తిరుమల క్షేత్రాన్ని ప్రతి నిత్యం వేలాది మంది దర్శించుకుంటారు. తమ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను కొలుస్తారు. ప్రతి నిత్యం కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీలో వేస్తారు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కియోస్క్ లను ఏర్పాటు చేసింది టీటీడీ. దీని వల్ల సమయం వృధా కాదు.
ఇదిలా ఉండగా కియోస్క్ ప్రారంభం సందర్భంగగా జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ జీఎం ఐటీ నాయుడు, అన్నప్రసాదం సూపరింటెండెంట్ ఉష తదితరులు పాల్గొన్నారు.