తిరుమలలో భవనాన్ని అప్పగించాలని ఆదేశం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలలో విశాఖ శారదా పీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. వెంటనే తమ భవనాన్ని అప్పగించాలని ఆదేశించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పనంగా శారదా పీఠానికి మేలు చేకూర్చేలా తిరుమలలో భవనం, విశాఖలో తక్కువ ధరకు భూములు ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరింది. ఆ వెంటనే శారదా పీఠంకు అప్పగించిన వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
దీనిపై టీటీడీ కోర్టును ఆశ్రయించింది. పాలక మండలి తీర్మానం ఆమోదించింది. దీనిని సమర్పించడంతో వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో అత్యంత తక్కువ ధరకు ప్రభుత్వ ఆస్తులను, భూములను, స్థలాలను అప్పగించడం అటు ఆంధ్రప్రదేశ్ లో ఇటు తెలంగాణలో కొనసాగుతూ వస్తోంది. ఇదే క్రమంలో శారదా పీఠాధిపతి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో యాగం నిర్వహించారు. ఇదంతా ప్రభుత్వ ఖర్చుతోనే చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇక మాజీ సీఎం జగన్ రెడ్డిని కంట్రోల్ చేసే స్థాయికి వెళ్లారు ఈ స్వామీజీ. ఒకప్పుడు థియేటర్ల వద్ద బ్లాక్ టికెట్లు అమ్మాడన్న విమర్శలు కూడా ఉన్నాయి.