DEVOTIONAL

తిరుమ‌ల‌లో పాత సౌకర్యాల పున‌రుద్ద‌ర‌ణ

Share it with your family & friends

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో శ్యామ‌లా రావు

తిరుమ‌ల – కోట్లాది మంది భ‌క్తుల కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పేరు పొందారు తిరుమ‌లలో కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌లు. ప్ర‌తి రోజూ క‌నీసం 70 నుంచి 80 వేల మందికి పైగా ద‌ర్శ‌నం చేసుకుంటున్నారు. త‌మ మొక్కు తీర్చుకుంటున్నారు.

నిన్న‌టి వ‌ర‌కు తిరుమ‌ల‌కు వెళ్లాలంటే భ‌యప‌డే స్థితి ఉండేది. మ‌ధ్య ద‌ళారుల ప్ర‌మేయం ఎక్కువ‌గా ఉండ‌డం, రాజ‌కీయాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం, మంత్రులు, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌కు వంత పాడ‌డంతో సామాన్య భ‌క్తుల‌కు తీవ్ర ఇబ్బంది ఏర్ప‌డింది.

తాజాగా సీన్ మారింది. రాష్ట్రంలో జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ కూలి పోయింది. ప్ర‌జా స‌ర్కార్ కొలువు తీరింది. తిరుమ‌ల‌లో ఐదు సంవ‌త్స‌రాల పాటు దూర‌మైన సౌక‌ర్యాల‌ను పున‌రుద్ద‌రించింది టీటీడీ. కొత్త‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శ్యామ‌లా రావు దూకుడు పెంచారు. క్యూ లైన్ల‌లో ఉన్న భ‌క్తుల‌కు పాలు, అల్ప‌హారం, సాంబార్ అన్నం పంపిణీ చేస్తున్నారు.

ఎక్కువ సేపు నిలుచోకుండా చూస్తున్నారు. న‌డిచి వ‌చ్చే భ‌క్తుల‌కు కిందే టోకెన్లు అంద‌జేస్తున్నారు. ల‌డ్డూ ప్ర‌సాదంలో నాణ్య‌త పెర‌గ‌డంతో భ‌క్తులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.